విశాఖ గ్యాస్ లీక్ ఘటన.. 12 మంది పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్
విశాఖపట్నంలోని ఎల్‌జీ పాలిమర్స్ నుంచి విషవాయువు లీకయిన దుర్ఘటనలో చుట్టూ పక్కల గ్రామాలకు చెందిన 12 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే
విశాఖపట్నంలోని ఎల్‌జీ పాలిమర్స్ నుంచి విషవాయువు లీకయిన దుర్ఘటనలో చుట్టూ పక్కల గ్రామాలకు చెందిన 12 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. శుక్రవారం మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహించగా..రక్తంలో ఆక్సిజన్ శాతం పడిపోయి, ఊపిరాడక చనిపోయారని శవ పరీక్షలు నిర్వహించిన విశాఖ కేజీహెచ్ ఫోరెన్సిక్ వైద్యులు తెలిపారు.విషవాయువును పీల్చడంతో మరణించారని తేలింది. ఊపిరితిత్తులు బాగా దెబ్బతిన్నాయి విషవాయువు వల్ల రక్తంలో ఆక్సిజన్ పడిపోయి మరణించారు.
ఈనెల 7వ తేదీన తెల్లవారుజామున ఆర్ఆర్ వెంకటాపురం వద్ద ఉన్న ఎల్జీ పాలిమర్స్‌లో స్టైరీన్ గ్యాస్ లీకవ్వడంతో 12 మంది మరణించారు. మూగజీవాలు సైతం విగత జీవులుగా మిగిలిపోయాయి. కేజీహెచ్‌లోనూ పోస్ట్‌మార్టం నిర్వహించి మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించారు. ఊపిరితిత్తులపై స్టైరీన్ ప్రభావాన్ని అంచనా వేసేందుకు వాటి భాగాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు.బాధితుల కుటుంబాకు ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చింది. ఈ ఘటన పైఎల్‌జీ పాలిమర్స్ స్పందించింది. ప్లాంటులోని ట్యాంకు నుంచి స్టైరీన్ గ్యాస్ ఆవిర్లు లీకవడం వల్లే ప్రమాదం చోటుచేసుకుందని ఆ సంస్థ తెలిపింది.ఈ ప్రమాదం వల్ల ప్రభావితులైన ప్రతి ఒక్కరికీ తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది.