Payakaraopeta: అక్రమ వసూళ్ళకు పాల్పడిన గ్రామ వాలంటీర్

మండలంలోని గుంటపల్లి గ్రామంలో ఓ కిలాడి గ్రామ వాలంటీర్ బాగోతం బయటపడింది.

Update: 2020-04-06 13:20 GMT

పాయకరావుపేట: మండలంలోని గుంటపల్లి గ్రామంలో ఓ కిలాడి గ్రామ వాలంటీర్ బాగోతం బయటపడింది. గెడ్డం వెంకటరమణ అనే వ్యక్తి వాలంటీర్ ఉద్యోగంలో జాయిన్ అయ్యి పట్టుమని 6 నెలలు కూడా గడవక ముందే లంచావతారమెత్తి ఫింఛనుదార్లను మోసగించి వసూళ్ళకు పాల్పడ్డాడు. ఫింఛనుదార్ల పేరున భూములు ఉన్నట్టు రికార్డులు చూపిస్తున్నాయంటూ చెప్పడంతో లబ్దిదారులు ఆందోళన చెందారు. రికార్డులలో భూమి కలిగి ఉన్నట్లు చూపించడం వలన ఫింఛను నిలిచిపోవడంతో పాటు రేషన్ కార్డు రద్దయిపొతుందని బెదిరించాడు. దీంతో తమ పెన్షన్ ఎక్కడ ఆగిపోతుందోన్న భయంతో గ్రామ వాలంటీర్ గెడ్డం వెంకటరమణ అడిగిన డిమాండ్ మేరకు ఒక్కొక్కరూ రూ.1500 నుంచి రూ.2000 రూపాయల వరకు సమర్పించున్నారు.

సుమారు 70 మంది ఫింఛన్ దారుల నుండి దాదాపు రూ.2 లక్షలు వసూలు చేశాడని బాధితులు వాపొతున్నారు. అయితే వాలంటీర్ అడిగిన లంచం సమర్పించుకున్నప్పటికీ వారికి ఫింఛను మాత్రం రాలేదు, తమ సమస్య పరిష్కరించబడలేదు సదరు వాలంటీర్ని బాధితులు ఫింఛన్ గురించి అడుగుతుంటే రేపు-మాపు అంటూ, సెక్రటరీ లేడంటూ రకారకాల కొంటెసాకులు చెబుతుండటంతో విసుగుచెందిన బాధితులు, గ్రామ పెద్ద గెడ్డం బుజ్జికి తెలియపరిచారు. దీంతో కిలాడీ వాలంటీర్ మోసం గుట్టురట్టయ్యింది. అధికారులు వెంటనే వాలంటీర్ పై చర్యలు తీసుకుని, తమకు న్యాయం చేయాలంటూ బాధితులు కోరుచున్నారు. బాధితులంతా దినసరి కూలీపని చేసుకునే పేదలేనని తెలిసింది.





Tags:    

Similar News