vijayasai reddy fire on chandrababu: ప్రతిప‌క్ష నాయ‌కుడిగా ఉండే నైతిక హ‌క్కును చంద్రబాబు కోల్పోయారు ; వైసీపీ ఎంపీ

vijayasai reddy fire on chandrababu: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు పైన తీవ్ర విమర్శలు చేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. ఈ మేరకు అయన ట్విట్టర్ వేదికగా ట్విట్టర్ లో చంద్రబాబు, లోకేష్ లపైన వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Update: 2020-06-26 15:36 GMT

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు పైన తీవ్ర విమర్శలు చేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. ఈ మేరకు అయన ట్విట్టర్ వేదికగా ట్విట్టర్ లో చంద్రబాబు, లోకేష్ లపైన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. "మాలోకం కళ్లన్నీ ఇసుక మీదే. అప్పట్లో శాండ్ మాఫియా నుంచి నెలనెలా మామూళ్లు అందుకునే వాడు. ఇప్పుడా ఆదాయం పోయిందని ఏడుపు. హైదరాబాద్ లో కూర్చుని ఉచిత సలహాలు ఇవ్వకుండా ఇక్కడి కొచ్చి సమస్యను స్టడీ చేసి మాట్లాడు. ఎక్కడో ఒక ఘటనను చూపి ఇలాగే జరుగుతోందని అంటే ఎలా చిట్టి నాయుడు" అంటూ ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి.. అంతేకాకుండా రాజ్యస‌భ ఫ‌లితాలు వెల్లడించిన త‌ర్వాత ‌చంద్రబాబు ప్రతిప‌క్ష నాయ‌కుడిగా ఉండే నైతిక హ‌క్కును కోల్పోయార‌న్నారని అయన మరో ట్వీట్ చేశారు.

ఇక ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని పొగుడుతూ మరో ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి.. "కోవిడ్ నియంత్రణ, చికిత్సలో సిఎం జగన్ గారి కార్యదీక్ష, ముందు చూపును ప్రతి రాష్ట్రం ప్రశంసిస్తోంది. 7 లక్షల టెస్టులు పూర్తికాగా, ప్రతి కుటుంబానికి పరీక్షలు జరిపే ఏర్పాట్లు జరుగుతున్నాయి. 30 వేల బెడ్లు అందుబాటులోకి వచ్చాయి. వచ్చే 2 నెలల్లో మరో 40 వేల పడకలు సిద్ధమవుతాయి"అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

ఇక ఏపీలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 605 కేసులు వచ్చాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరొనా కేసుల సంఖ్య 11,487 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 6147 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక కరోనా నుంచి 5196 మంది కోలుకున్నారు. ఇక అటు కరోనాతో పోరాడి 146 మంది చనిపోయారు.

 

Tags:    

Similar News