సీఎం జగన్ కు హోంమంత్రి అమిత్ షా ఫోన్..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ఫోన్ చేశారు.

Raj
By Raj
Published on: 18 Jun 2020 6:23 PM IST
సీఎం జగన్ కు హోంమంత్రి అమిత్ షా ఫోన్..
X
YS Jagan, Amit Shah (File Photo)

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. ఫోనులో అమిత్ షా తోపాటు కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా మాట్లాడారు. రేపు సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాల్గొనవలసిందిగా జగన్ ను కోరినట్టు తెలుస్తోంది. అలాగే రాష్ట్రానికి సంబంధించిన పలు కీలకాంశాలు కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది.

కాగా ఇండియా, చైనా సరిహద్దుల్లో తలెత్తిన ఉద్రిక్తతల కారణంగా 20 మంది సైనికులు చనిపోవడం సహా సరిహద్దుల్లో ఏ విధంగా వ్యవహరించాలనే వంటి కీలకాంశాలపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కేంద్రం నిర్ణయం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ప్రధాని నరేంద్రమోదీ ఆద్వ్యర్యంలో దేశంలోని వివిధ పార్టీల నాయకులు ఈ సమావేశంలో పాల్గొంటారని ప్రధాని కార్యాలయం తెలిపింది.


Raj

Raj

Next Story