Chandrababu Naidu: ట్విట్టర్ ప్రొఫైల్ మార్చిన చంద్రబాబు

Chandrababu Naidu: ట్విట్టర్ ప్రొఫైల్ మార్చిన చంద్రబాబు
x
Highlights

రాష్ట్రంలో రోజురోజుకు పరిస్థితులు మారుతున్నాయి. ఏ రోజు ఎవరి పరిస్తితి ఎలా ఉంటుందో అర్థం కాని దుస్థితి.

రాష్ట్రంలో రోజురోజుకు పరిస్థితులు మారుతున్నాయి. ఏ రోజు ఎవరి పరిస్తితి ఎలా ఉంటుందో అర్థం కాని దుస్థితి. అయితే తాజాగా అచ్చెన్నాయుడు అరెస్టును ఖండిస్తూ టీడీపీ ఒక ఉద్యమం చేస్తోంది. దీనిలో భాగంగా చంద్రబాబు ట్విట్టర్ ప్రొఫైల్ పిక్చర్ ను సైతం వుయ్ స్టాండ్ విత్ యు అంటూ అచ్చెన్నాయుడుకు సంఘీభావం ప్రకటించారు.

టీడీపీ సీనియర్ నాయకుడు అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయటంతో తెలుగు తమ్ముళ్లు ఆందోళన బాట పట్టాయి. పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహంతో ఉగిపోతున్నాయి. చంద్రబాబు నుంచి జిల్లా స్థాయి నేతల వరకు ఈ అరెస్ట్ ను ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. అంతే కాదు… సోషల్ మీడియాలో కొత్త ఉద్యమానికి తెరలేపారు. అచ్చెన్నాయుడికి తాము బాసటగా ఉంటామంటూ ట్విట్టర్ లో ఇప్పటికే "వుయ్ స్టాండ్ విత్ యూ" అచ్చెన్నాయుడు అనే హ్యాష్ ట్యాగ్ ను టీడీపీ నేతలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇక, టీడీపీ అధినేత చంద్రబాబు తన ట్విట్టర్ ప్రొఫైల్ కూడా అచ్చెన్నాయుడు ఫోటోను పెట్టుకున్నారు. "వుయ్ స్టాండ్ విత్ యూ" అంటూ సంఘీభావం ప్రకటించారు. టీడీపీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ కూడా చంద్రబాబు రూట్‌‌లోనే ప్రొఫైల్ ఫోటోని అప్ డేట్ చేశారు

Show Full Article
Print Article
More On
Next Story
More Stories