క్షత్రియ సేవ సమితి ఆధ్వర్యంలో కూరగాయల పంపిణీ

మండలంలోని పల్లంకుర్రులో అల్లూరి సీతారామరాజు క్షత్రియ సేవ సమితి అద్వర్యంలో కూరగాయలను పంపిణి చేసారు.

Update: 2020-04-15 16:16 GMT
Kshatriya Sevasamithi

కాట్రేనికోన: మండలంలోని పల్లంకుర్రులో అల్లూరి సీతారామరాజు క్షత్రియ సేవ సమితి అద్వర్యంలో కూరగాయలను పంపిణి చేసారు. అల్లూరి సీతారామరాజు క్షత్రియ సేవ సమితి సమకూర్చిన రూ.1.50 లక్షలు విలువ చేసే కూరగాయలను పల్లంకుర్రు లోని 1, 2, 3, 4 వార్డులకు చెందిన 1250 కుటుంబాలకు పంచాయతి కార్యదర్శి పి.రవి చేతుల మీదుగా పంపిణి చేసారు. కార్యక్రమానికి ముందు అల్లూరి సీతారామరాజు విగ్రహానికి సేవా సమితి సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో మంతెన సత్యనారాయణ రాజు (పల్లంకుర్రు బాబు), మంతెన విజయరామరాజు, జంపన హరి కుమార్ రాజు, భూపతిరాజు శివ కుమార్ వర్మ (గబ్బర్ సింగ్ ), మంతెన సూర్య భాస్కరరాజు, మంతెన కృష్ణం రాజు, మంతెన అశోక్ వర్మ, పెన్మత్స రామకృష్ణం రాజు(గెడ్డం కృష్ణ ) అల్లూరి సీతారామరాజు క్షత్రియ సేవ సమితి సభ్యులు పాల్గొన్నారు.


Tags:    

Similar News