జంగారెడ్డిగూడెం: మండలంలోని తాడువాయి సెంటర్‌లో విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం వికలాంగులకు, వృద్ధులకు, కేజీ రైస్, కేజీ దొండకాయలు సుమారు 65 మందికి అందజేసినట్లు విభిన్న ప్రతిభావంతుల సంఘం మండల అధ్యక్షుడు ఆవుల వెంకట సత్యనారాయణ తెలిపారు.
ఈ పంపిణీ కార్యక్రమం ఆవుల వెంకట సత్యనారాయణ, సంఘ సభ్యులు ఉపాధ్యాయుడు అందుగుల నాగరాజులు తమ ద్రవ్య సహాయంతో అందజేసినట్లు సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతులు, వృద్ధులు, విభిన్న ప్రతిభావంతుల సంఘానికి కృతజ్ఞతలు తెలిపారు.