Kurnool: గౌడుగల్లులో చిరుత పులుల కలకలం

Kurnool: కర్నూలు జిల్లా కోసిగి మండలంలోని గౌడుగల్లులో 2చిరుత పులులు హల్‌చల్ చేశాయి.

Update: 2026-01-02 07:01 GMT

Kurnool: గౌడుగల్లులో చిరుత పులుల కలకలం

Kurnool: కర్నూలు జిల్లా కోసిగి మండలంలోని గౌడుగల్లులో 2చిరుత పులులు హల్‌చల్ చేశాయి. 3 రోజుల నుంచి పులులు గ్రామంలో సంచరిస్తుండడంతో గ్రామస్తులు భయాందోళననికి గురవుతున్నారు. గ్రామంలోని యువకులు పెద్దగా కేకలు వేస్తూ... బాణాసంచా కాలుస్తూ... టార్చ్ లైట్లు వేసి వాటిని దారి మళ్లించినట్లు గ్రామస్తులు తెలిపారు. సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఫారెస్ట్ అధికారులు స్పందించి జంట చిరుత పులులను బంధించాలని గ్రామస్తులు కోరారు.

Tags:    

Similar News