TTD: తిరుమల శ్రీవారి దర్శనం – అక్టోబర్ నెల కోటా విడుదల తేదీలు ప్రకటించిన తితిదే

తిరుమల: అక్టోబర్ నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి దర్శనం, గదుల కోటా విడుదల తేదీలను తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారికంగా ప్రకటించింది.

Update: 2025-07-15 13:26 GMT

TTD: తిరుమల శ్రీవారి దర్శనం – అక్టోబర్ నెల కోటా విడుదల తేదీలు ప్రకటించిన తితిదే

తిరుమల: అక్టోబర్ నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి దర్శనం, గదుల కోటా విడుదల తేదీలను తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారికంగా ప్రకటించింది.

టికెట్ విడుదల వివరాలు

ఆర్జిత సేవా టికెట్లు – జూలై 19 ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి

ఈ-సేవా లక్కీ డిప్ నమోదు – జూలై 21 ఉదయం 10 గంటల వరకు

లక్కీ డిప్ టికెట్ చెల్లింపు – జూలై 21 నుంచి 23 మధ్యాహ్నం 12 గంటలలోపు

ప్రత్యేక సేవల టికెట్ విడుదల తేదీలు

కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, పుష్పయాగం – జూలై 22 ఉదయం 10 గంటలకు

వర్చువల్ సేవలు, దర్శన స్లాట్లు – జూలై 22 మధ్యాహ్నం 3 గంటలకు

అంగప్రదక్షిణం టోకెన్లు – జూలై 23 ఉదయం 10 గంటలకు

శ్రీవాణి ట్రస్టు ఆన్‌లైన్ కోటా – జూలై 23 ఉదయం 11 గంటలకు

వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల ఉచిత ప్రత్యేక దర్శనం – జూలై 23 మధ్యాహ్నం 3 గంటలకు

రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు – జూలై 24 ఉదయం 10 గంటలకు

తిరుమల, తిరుపతి గదుల బుకింగ్ – జూలై 24 మధ్యాహ్నం 3 గంటలకు

భక్తులు https://ttdevasthanams.ap.gov.in అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రమే ఆర్జిత సేవలు, దర్శనం టికెట్లు, గదులు బుక్ చేసుకోవాలని TTD విజ్ఞప్తి చేసింది.

Tags:    

Similar News