Tirumala 300 Darshan Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. నేడు ఏప్రిల్ నెల టికెట్లు విడుదల
Tirumala 300 Darshan Tickets: తిరుపతి వెళ్లాలనుకునేవారికి టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. ఏప్రిల్ నెలకు సంబంధించి టికెట్లను నేడు విడుదల చేయనుంది. తిరుమల శ్రీవారి భక్తుల కోసం టీటీడీ మరో అద్భుతమైన అవకాశాన్ని కల్పించింది. ఏప్రిల్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు, వసతి గదుల ఆన్ లైన్ కోటాను రిలీజ్ చేయనుంది. తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు టీటీడీ గతంలో మాదిరిగానే జనవరి 23వ తేదీ నుంచి ఏ రోజుకారోజు ఎస్ ఎస్ డి టోకెన్లను అందించనుంది.
నేడు ఉదయం 10గంటలకు అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను రిలీజ్ చేయనున్నారు. శ్రీవాణి ట్రస్టు టికెట్ల ఏప్రిల్ నెల కోటాను నేడు ఉదయం 11 గంటలకు ఆన్ లైన్ లో అందుబాటులోకి తీసుకురానున్నారు. వయోవృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులున్న భక్తులకు ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను మధ్యాహ్నం 3 గంటలకు ఆన్ లైన్ లో రిలీజ్ చేస్తారు. జనవరి 24 తేదీ ఉదయం 10గంటలకు ఏప్రిల్ నెలకు సంబంధించి రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను టీటీడీ రిలీజ్ చేయనుంది. భక్తులు ఈ టికెట్లను https://ttdevasthanams.ap.gov.in ద్వారా బుక్ చేసుకోవచ్చని సూచించింది.
తిరుమల, తిరుపతిలో ఏప్రిల్ నెలకు సంబంధించిన వసతి గదుల కోటాను జనవరి 24వ తేదీ మధ్యాహ్నం 3గంటలకు ఆన్ లైన్ లో అందుబాటులోకి తీసుకువస్తున్నారు. భక్తులు గదులను ముందుగానే బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది. భక్తులు తమ దర్శన టికెట్లు, వసతి గదులు,ఇతర సేవా టోకెన్లను ముందుగా బుక్ చేసుకుని..సేవలను సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ కోరింది. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జనవరి 23 అధ్యయనోత్సవాలు ముగియనున్నాయి. డిసెంబర్ 30న ప్రారంభమైన ఈ ఉత్సవాలు మొత్తం 25రోజుల పాటు జరుగుతున్నాయి.