లక్కవరంలో గోవుల అక్రమ రవాణా గుట్టురట్టు.. కంటైనర్‌లో 89 ఆవులు సీజ్!

Cattle Smuggling: పోలవరం జిల్లా లక్కవరం సరిహద్దు ప్రాంతంలో అక్రమంగా తరలిస్తున్న గోవుల గుట్టును పోలీసులు రట్టు చేశారు.

Update: 2026-03-18 06:11 GMT

లక్కవరంలో గోవుల అక్రమ రవాణా గుట్టురట్టు.. కంటైనర్‌లో 89 ఆవులు సీజ్!

Cattle Smuggling: పోలవరం జిల్లా లక్కవరం సరిహద్దు ప్రాంతంలో అక్రమంగా తరలిస్తున్న గోవుల గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఒక భారీ కంటైనర్‌లో అత్యంత దారుణంగా తరలిస్తున్న 89 గోవులను మోతుగూడెం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఒడిశా నుంచి హైదరాబాద్‌కు..

పోలీసుల కథనం ప్రకారం.. ఒడిశా రాష్ట్రం నుంచి చింతూరు మీదుగా హైదరాబాద్‌కు ఈ గోవులను అక్రమంగా తరలిస్తున్నారు. రహస్య సమాచారం అందుకున్న పోలీసులు లక్కవరం వద్ద తనిఖీలు చేపట్టగా, ఒక కంటైనర్‌లో గోవులు ఉన్నట్లు గుర్తించారు. ఎటువంటి అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా గోవులను తరలిస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు.

ముగ్గురిపై కేసు నమోదు - గోశాలకు తరలింపు:

ఈ అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు చింతూరు సీఐ సీహెచ్ గోపాలకృష్ణ తెలిపారు. కాగా, స్వాధీనం చేసుకున్న 89 గోవులను సురక్షితంగా గోకవరం గోశాలకు తరలించినట్లు ఆయన వెల్లడించారు.

అక్రమ జంతు రవాణాపై ఉక్కుపాదం మోపుతామని, సరిహద్దు ప్రాంతాల్లో నిఘా మరింత కఠినతరం చేస్తామని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.

Tags:    

Similar News