నారా రోహిత్ పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ.. ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తారో చెప్పేసిన హీరో!
Nara Rohith: చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు 74వ జయంతి వేడుకలు ఆయన స్వగ్రామం నారావారిపల్లెలో ఘనంగా నిర్వహించారు.
నారా రోహిత్ పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ.. ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తారో చెప్పేసిన హీరో!
Nara Rohith: చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు 74వ జయంతి వేడుకలు ఆయన స్వగ్రామం నారావారిపల్లెలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఆయన భార్య ఇందిరమ్మ, కుమారులు నారా రోహిత్, నారా గిరీష్ మరియు ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. స్మృతి వనం వద్ద ఆయన సమాధికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ప్రత్యక్ష రాజకీయాల్లోకి నారా రోహిత్?
ఈ సందర్భంగా నారా రోహిత్ తన రాజకీయ భవిష్యత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత కొంతకాలంగా వినిపిస్తున్న రాజకీయ అరంగేట్రం వార్తలకు ఆయన తెరదించారు. "సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తాను" అని రోహిత్ స్పష్టం చేశారు. తండ్రి జయంతి రోజే రాజకీయ ఎంట్రీపై ఆయన సానుకూలంగా స్పందించడం కేడర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
ప్రజల ఆదరాభిమానాలపై భావోద్వేగం:
"మా తండ్రిగారి జ్ఞాపకాలను ప్రజలు నేటికీ మాతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. అభిమానులు చూపిస్తున్న ఆదరాభిమానాలకు మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం" అని రోహిత్ భావోద్వేగానికి లోనయ్యారు. జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి యువత నుంచి విశేష స్పందన లభించింది.
నారా రామ్మూర్తి నాయుడు జ్ఞాపకార్థం చేపట్టిన పలు సేవా కార్యక్రమాలు స్థానికుల ప్రశంసలు అందుకున్నాయి. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో అభిమానులు, పార్టీ శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.