TTD: టీటీడీ లో కోర్టుకెక్కిన అర్చకులు

TTD: శ్రీవారి ఆలయంలో కైంకర్యాలు చేస్తున్న అర్చకుల మధ్య వివాదం చెలరేగి కోర్టు మెట్లు ఎక్కేలా చేసింది.

Update: 2021-05-04 12:45 GMT

టీటీడీ ప్రధాన అర్చకులు 

TTD: గోవింద నామస్మరణలతో మారుమోగాల్సిన పవిత్ర పుణ్య క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకులు కోర్టుకెక్కారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మరో మారు వివాదానికి కారణమైంది. శ్రీవారి ఆలయంలో కైంకర్యాలు చేస్తున్న అర్చకుల మద్య వివాదం చెలరేగి కోర్టు మెట్లు ఎక్కేలా చేసింది. తిరుమలలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా రిటైర్ అయి పునఃనియమించబడ్డ అర్చకులు వెర్సస్ ప్రస్తుత ప్రధాన అర్చకులు వివాదంగా ఏర్పడింది. టీటీడీ తమకు అర్చకత్వం ఇస్తే చాలు అంటూ యువ పండితులు సీఎంను కోరితే.., తమ వంశ పర్యంపర్యాని కాపాడాలని సీనియర్ అర్చకులు ప్రతిపాదనలు చేశారు. ఇంత గొడవకు ముఖ్యకారణం అప్పటి టీడీపీ హయాంలో పలకండలి తీసుకున్న నిర్ణయాలే ఇప్పటి వరకు వివాదంగా మారుతూ వస్తుంది.

ప్రస్తుతం తానుఆలయ ప్రధాన అర్చకునిగా ఉండగా అదే వంశానికి చెందిన మరొకరిని ఎలా నియమిస్తారు అంటూ....కోర్టులో ప్రభుత్వ ఉత్తర్వులను సవాల్ చేస్తూ వేణుగోపాల్ దీక్షితులు వేసిన పిటిషన్ హైకోర్టు విచారణకు స్వీకరించింది. ప్రతివాదులుగా ఏపీ ప్రభుత్వం, టీటీడీ, రమణదీక్షితులను చేర్చి...వారికీ నోటీసులను జారీ చేసింది. ఎలాగైనా తనకు అనుకూలమైన తీర్పు కోర్టు నుంచి వస్తుందని వేణుగోపాల్ దీక్షితులు ఆశతో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులుగా కొనసాగుతున్న వేణుగోపాల్ దీక్షితులు కోర్టు మెట్లు ఎక్కడం సంచలంగా మారిందనే చెప్పుకోవాలి.

2018 ఏప్రిల్ లో పుట్ట సుధాకర్ యాదవ్ చైర్మన్ గా ఉన్న టిటిడి పాలక మండలి ప్రమాణ స్వీకారం చేసిన నెలలోపే మిరాశి అర్చకుల రిటైడ్ మెంట్ చేయాలని నిర్ణయించింది. దీనికి టిటిడి అధికారులు, పాలక మండలి సభ్యులు పాలక మండలి సమావేశంలో చర్చించి ఆమోదం తెలుపుతూ నిర్ణయంకు వచ్చారు. దీంతో అర్చకుల వివాదం తెరపైకి వచ్చింది.

Tags:    

Similar News