YV Subba Reddy: ఒకరిని తొక్కేసి మరొకరిని ఆశీర్వదించాల్సిన అవసరం మాకు లేదు
YV Subba Reddy: జనసేనను తొక్కేసేందుకు చిరంజీవికి రాజ్యసభ పదవి ఇస్తున్నారన్న ప్రచారంలో వాస్తవం లేదని టీటీడీ ఛైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి అన్నారు.
YV Subba Reddy: ఒకరిని తొక్కేసి మరొకరిని ఆశీర్వదించాల్సిన అవసరం మాకు లేదు
YV Subba Reddy: జనసేనను తొక్కేసేందుకు చిరంజీవికి రాజ్యసభ పదవి ఇస్తున్నారన్న ప్రచారంలో వాస్తవం లేదని టీటీడీ ఛైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి అన్నారు. పార్టీకి పనిచేసిన వారిలో ఎవరికి రాజ్యసభ ఇవ్వాలో సీఎంకు తెలుసన్నారు. సీఎంను కలిసిన వ్యవహారంలో జరుగుతున్న ప్రచారాన్ని చిరంజీవి కూడా ఖండించారన్నారు. ఇంక దీనిపై మాట్లాడటం అనవసరమని తేల్చిచెప్పారు.
మరోవైపు ప్రజలు సీఎం జగన్ పాలనకు బ్రహ్మరధం పడుతున్నారన్నారు. వైకుంఠ ఏకాదశి రోజు సామాన్యులకు తిరుపతిలో స్వామివారి దర్శనం రెండు గంటల్లో చేయించామన్నారు. కొన్ని ఇబ్బందులు జరిగినా విఐపి భక్తులతో పాటు సామాన్యులకు కూడా దర్శనం బాగా జరిగిందని టీటీడీ ఛైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి అన్నారు.