ఇవాళ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి

*తండ్రికి నివాళులు అర్పించేందుకు వేర్వేరుగా షర్మిల, జగన్

Update: 2023-09-02 03:00 GMT

ఇవాళ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి

YS Rajasekhar Reddy: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి సందర‌్భంగా ఇవాళ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇడుపుల పాయ చేరుకోనున్నారు. ఉదయం 9 గంటల 30 నిమిషాలకు గన్నవరం విమానాశ్రయం చేరుకుని 10 గంటల 20 నిమిషాలకు కడప ఎయిర్ పోర్టు చేరుకుంటారు. అక్కడినుంచి ఇడుపులపాయ చేరుకుని వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధికి నివాళులు అర్పిస్తారు.

ఇవాళ ఉదయం 8 గంటలకు షర్మిల, 11 గంటలకు జగన్ మోహన్ రెడ్డి నివాళులు అర్పించే విధంగా షెడ్యూలు ఖరారైంది. నివాళులు అర్పించిన తర్వాత పులివెందులలో పలు అభివృద్ధి కార్యాక్రమాల్లో పాల్గొనాల్సిన జగన్ మోహన్ రెడ్డి, రేపు లండన్ పర్యటన ఉన్న దృష్ట్యా అధికారిక కార్యక్రమాలను రద్దుచేసుకుని ఇడుపుల పాయనుంచి నేరుగా తాడేపల్లి క్యాంప్ కార్యాలయం చేరుకుంటారు.

Tags:    

Similar News