జీవితంలో అన్ని ప్రశ్నలకు సమాధానం దొరికాలంటే...

Update: 2019-12-08 07:13 GMT
ప్రతీకాత్మక చిత్రం

గీతా జయంతి మహోత్సవం టిటిడి, హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో వైభవంగా జరిగింది. టీటీడి పరిధిలోని విద్యాసంస్థలలో చదువుకుంటున్న విద్యార్థులతో సామూహిక గీతాపారాయణం నిర్వహించారు. నిన్న తిరుపతి ఎస్వీ హైస్కూల్ మైదానంలో జరిగిన ఈ కార్యక్రమానికి టీటీడి ఛైర్మన్ వైవిసుబ్బారెడ్డితో పాటు పలువురు ప్రముఖులు, పీఠాధిపతులు హాజరయ్యారు. భగవద్గీత పఠనం ద్వారా జీవితం సవ్యమైన దిశలో కొనసాగుతుందని, అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందని టిటిడి ఛైర్మన్ వైవిసుబ్బారెడ్డి తెలిపారు. చిన్నపట్టి నుంచే పిల్లలకు తల్లిదండ్రులు భగవద్గీతను చదవించాలని ఆయన కోరారు.

జీవితంలో అన్ని ప్రశ్నలకు సమాధానం దొరికే భగవద్గీత పఠనాన్ని అలవాటు చేయడానికి విద్యార్థిని, విద్యార్థులందరితో సామూహిక గీతాపారాయణం నిర్వహించింది. వేల మంది విద్యార్థినులు చేసిన గీతాపారాయణంతో తిరుపతి పులకించింది. తిరుపతి ఎస్వీ హైస్కూల్ మైదానంలో జరిగిన ఈ కార్యక్రమానికి టిటిడి ఛైర్మన్ వైవిసుబ్బారెడ్డితో పాటు పలువురు ప్రముఖులు, పీఠాధిపతులు హాజరయ్యారు.

విద్యార్థులలో ఆథ్యాత్మిక తత్త్వాన్ని పెంపొందిచడమే కాకుండా జీవితంలో అన్ని ప్రశ్నలకు సమాధానం దొరికే భగవద్గీత పఠనాన్ని అలవాటు చేయడం ద్వారా జీవిత గమనాన్ని సవ్యమైన దిశలో అలవరుచుకోవడానికి అవకాశం ఉంటుందని వక్తలు అభిప్రాయ పడ్డారు. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ వ్యాప్తికి, హైందవ సనాతన సాంప్రదాయాల అనుసరణకు పెద్దపీఠ వేస్తుందని అన్నారు. అన్యమత ప్రచారమే కాదు, అలాంటి కార్యకలాపాల పోకడలకు కూడా టిటిడిలో తావులేదని ఛైర్మన్ సుబ్బారెడ్డి స్పష‌్టం చేశారు. అన్యమత వ్యవహారాలను టీటీడి సహించదని అన్నారు.




Tags:    

Similar News