తిరుమల మూసివేతపై టీటీడీ క్లారిటీ...

కరోనా వైరస్ వ్యాప్తి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ఉండటం వల్ల మే 3 వరకూ స్వామివారి దర్శనానికి భక్తులకు అనుమతి లేదు.

Update: 2020-04-28 13:37 GMT
Tirumala (File Photo)

కరోనా వైరస్ వ్యాప్తి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ఉండటం వల్ల మే 3 వరకూ స్వామివారి దర్శనానికి భక్తులకు అనుమతి లేదు. స్వామి వారికి రోజువారీ కైంకర్యాలు, పూజలు యధావిధిగా నిర్వహిస్తున్నారు. మార్చ్ 20 వతేది నుంచి శ్రీవారి దర్శనానికి భక్తులను నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే జూన్ 30వ తేదీ వరకు తిరుమల ఆలయంలో భక్తుల దర్శనం నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలితో చర్చించి నిర్ణయం తీసుకుందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే ఈ విషయాన్ని టీటీడీ పాలక మండలి ఖండించింది.

సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు నమ్మొద్దని కోరింది. నిర్ణయం ఏదీ తీసుకోలేదని తెలిసింది. టీటీడీ అధికారిక నిర్ణయాలను ప్రభుత్వం లేదా టీటీడీ ప్రకటిస్తుందని, అలాగే టీటీడీ అధికారిక వెబ్ సైట్లో సమాచారం ఉంటుందని తెలిపింది. భక్తులకు ఎప్పుడు అనుమతి ఇచ్చేది టీటీడీ త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. అప్పటి వరకు సోషల్ మీడియా లో ప్రచారాలను నమ్మొద్దని టీటీడీ కోరింది. తిరుమల ఆలయంపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటమని వెల్లడించింది.


Tags:    

Similar News