Tirumala: శ్రీవారి భక్తులకు భారీ శుభవార్త.. బ్రేక్ దర్శనాలపై టీటీడీ సంచలన నిర్ణయం..!
Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. తిరుమల శ్రీవారిని దర్శించేందుకు వీఐపీ సిఫారసు లేఖల స్వీకరణకు టీటీడీ మళ్లీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Tirumala: శ్రీవారి భక్తులకు భారీ శుభవార్త.. బ్రేక్ దర్శనాలపై టీటీడీ సంచలన నిర్ణయం..!
Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. తిరుమల శ్రీవారిని దర్శించేందుకు వీఐపీ సిఫారసు లేఖల (VIP Recommendation Letters for Break Darshan) స్వీకరణకు టీటీడీ మళ్లీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిపై ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి (Endowments Minister Anam Ramanarayana Reddy) అధికారికంగా ప్రకటన చేశారు.
మంత్రి తెలిపిన వివరాల ప్రకారం, ఈ గురువారం (మే 15, 2025) నుంచి తిరుమలలో ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖల ఆధారంగా బ్రేక్ దర్శనాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. గతంలో మే 1 నుంచి జూలై 15 వరకు ఈ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. వేసవి సెలవులలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
అయితే ఇప్పుడు ఆ గడువును ముందుగానే ముగిస్తూ, మే 15 నుంచి ప్రజాప్రతినిధులు, టీటీడీ బోర్డు సభ్యుల సిఫారసు లేఖలు తిరిగి స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రోటోకాల్ వీఐపీలు కాకుండా, ప్రజాప్రతినిధులు కూడా తమ సిఫారసులతో బ్రేక్ దర్శనానికి అవకాశం పొందనున్నారు.