Dollars Diwakar Reddy: తిరుపతి తిరుచానూరులో రూ.100 కోట్లతో పద్మావతి ఘాట్
Dollars Diwakar Reddy: తిరుపతి తిరుచానురులో 100 కోట్లతో పద్మావతి ఘాట్‌ను నిర్మించేందుకు ప్రభుత్వం నిధులు కేటాయించిందని తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి తెలిపారు.
Dollars Diwakar Reddy: తిరుపతి తిరుచానురులో 100 కోట్లతో పద్మావతి ఘాట్‌ను నిర్మించేందుకు ప్రభుత్వం నిధులు కేటాయించిందని తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి తెలిపారు. ఈ నిర్మాణం కోసం తుడా అధికారులతో కలిసి దివాకర్ రెడ్డి స్వర్ణముఖి నది పరివాహక ప్రాంతాన్ని పరిశీలించారు. పద్మావతి ఘాట్ నిర్మాణానికి సీఎం సానుకూలత వ్యక్తం చేశారని తెలిపారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు ఈ ఘాట్ లో పుణ్యస్నానాలు ఆచరించి, గంగా హారతిని వీక్షించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తామని దివాకర్ రెడ్డి తెలిపారు.ఈ ప్రాజెక్టును త్వరలోనె పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.