AP News: అల్లూరి జిల్లా చింతూరులో పెద్దపులి సంచారం
Tiger పులి కదలికలపై సీసీ కెమెరాలు ఏర్పాటు
AP News; అల్లూరి జిల్లా చింతూరులో పెద్దపులి సంచారం
Tiger In Alluri district: అల్లూరి జిల్లా చింతూరు మండలంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతుంది. పెద్దపులి సంచారం నిజమేనని అటవీశాఖ అధికారులు ధృవీకరించారు. సుకుమామిడి గ్రామంలోని పంట పొలాల దగ్గర పులి జాడలు కన్పించాయి. మోతుగూడెం గ్రామానికి చెందిన రైతుకు చెందిన దున్నపోతుని పులి చంపుకొని తిన్నట్లు ఆనవాళ్లు ఉండటంతో అటవీశాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. సుకుమామిడి గ్రామ పంట పొలాల్లో పెద్దపులి సంచరించినట్లు అధికారులు గుర్తించారు. చింతూరు DFO పుష్ప సౌజన్య తన సిబ్బందితో దున్నపోతుని పెద్దపులి చంపి తిన్నట్లు గుర్తించారు. అడవిలో నిఘా కెమెరాలను అమర్చామని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.