Chittoor: పులి ఉంది.. జాగ్రత్త.. గ్రామంలో దండోరా వేయించిన ఫారెస్ట్ ఆఫీసర్స్
Chittoor: పొలాలకు వెళ్లే రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచన
Chittoor: పులి ఉంది.. జాగ్రత్త.. గ్రామంలో దండోరా వేయించిన ఫారెస్ట్ ఆఫీసర్స్
Chittoor: చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలంలోని సంజీవరాయనిపల్లెలో చిరుతపులి సంచారం గ్రామస్తులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. గ్రామ సమీపంలో మంగళవారం నుంచి పులి సంచరిస్తున్నట్లు ఫారెస్ట్ అధికారులు దండోరా వేయించారు. అయితే పొలం పనులకు వెళ్లిన ఓ వ్యక్తికి పులి కనిపించినట్లు గ్రామస్తులకు ఫోన్ చేసి తెలియజేశాడు. దీంతో వారు హుటాహుటిన ఆ వ్యక్తి ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు. వారు వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు.
ఇక పులి సంచరించిన ప్రాంతానికి చేరుకున్న ఫారెస్ట్ సిబ్బంది పాదముద్రలను గుర్తించేందుకు ఆ ప్రాంతాన్ని పరిశీలించింది. పులి సంచరించిన ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో తనిఖీ చేసి పాదముద్రలు సేకరించారు. సమీప ప్రాంతాల్లో పులి సంచారంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గ్రామస్తులను హెచ్చరించారు ఫారెస్ట్ అధికారులు. రాత్రి పూట పొలాలకు వెళ్లే సమయంలో రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అటు బాలుర గురుకుల వసతి గృహం సమీపంలో చిరుత సంచరించడంతో విద్యార్థులు భయం గుప్పిట్లో ఉన్నారు. ఏ వైపు నుంచి చిరుత వస్తుందోనని విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు.