CM Jagan: చంద్రబాబు, ప్రజలకు మధ్య యుద్ధం ఇది
CM Jagan: జగన్ వస్తేనే మళ్లీ వాలంటీర్లు వస్తారు
CM Jagan: చంద్రబాబు, ప్రజలకు మధ్య యుద్ధం ఇది
CM Jagan: జగన్ వస్తేనే మళ్లీ వాలంటీర్లు వస్తారు.. ప్రతి పథకం మీ ఇంటికి వస్తుందనీ అన్నారు ఏపీ సీఎం జగన్. చంద్రబాబు అనే చంద్రముఖిని పెట్టెలో బిగించి మన రక్తం తాగకుండా జాగ్రత్త పడాల్సిన సమయం వచ్చిందని చెప్పుకొచ్చారు. సూర్యోదయం కన్నా ముందే ప్రతి ఇంటికి వెళ్లి పెన్షన్ అందిస్తున్న వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేసేందుకు చంద్రబాబు కుట్ర పన్నారని జగన్ ఆరోపించారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు బైసాస్ రోడ్డులో నిర్వహించిన బహిరంగ సభలో.. చంద్రబాబుపై జగన్ విరుచుకుపడ్డారు. ఇది జగన్‌కు, చంద్రబాబుకు జరుగుతున్న యుద్ధం కాదని, ప్రజలను మోసం చేయడమే అలవాటుగా పెట్టుకున్న చంద్రబాబుకు, ప్రజలకు మధ్య జరుగుతున్న యుద్ధమని జగన్ తెలిపారు.