Kurnool: కర్నూల్ జిల్లా కలెక్టరేట్‌ను ముట్టడించిన సీపీఐ శ్రేణులు, రైతులు

Kurnool: సమస్యను పరిష్కారిస్తామని హామీ ఇవ్వడంతో వెనుదిరిగిన నేతలు

Update: 2023-10-16 09:41 GMT

Kurnool: కర్నూల్ జిల్లా కలెక్టరేట్‌ను ముట్టడించిన సీపీఐ శ్రేణులు, రైతులు

Kurnool: కర్నూల్ జిల్లా కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. కర్నూల్ జిల్లాను కరువు జిల్లా ప్రకటించాలని సీపీఐ ఆధ్వర్యంలో ర్యాలీగా వచ్చి కలెక్టరేట్‌ను ముట్టడించారు. కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు యత్నించిన నిరసనకారులను పోలీసులు అడ్డుకోవడంతో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. దీంతో పోలీసుల సమాచారంతో నేతల వద్దకు వచ్చి జిల్లా జేసీ నారపురెడ్డి మౌర్యా చర్చలు జరిపారు. సమస్యను కలెక్టర్ వద్దకు తీసుకెళ్లి పరిష్కారం చూపుతామని హామీ ఇవ్వటంతో నేతలు వెనుదిరిగారు.

Tags:    

Similar News