Hindupur Municipality: హిందూపురం మున్సిపల్ చైర్మన్ పదవి టీడీపీ కైవసం
Hindupur Municipality: హిందూపురం మున్సిపల్ చైర్మన్ పదవిని టీడీపీ కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్మన్ టీడీపీ అభ్యర్ధిగా రమేష్ ఎన్నికయ్యారు.
Hindupur Municipality: హిందూపురం మున్సిపల్ చైర్మన్ పదవిని టీడీపీ కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్మన్ టీడీపీ అభ్యర్ధిగా రమేష్ ఎన్నికయ్యారు. టీడీపీ అభ్యర్ధికి 23 మంది కౌన్సిలర్లు మద్దతు ప్రకటించారు. చేతులెత్తి చటైర్మన్ ను ఎన్నుకున్నారు. హిందూపురం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠ రేపింది.
సాధారణ ఎన్నికల తర్వాత హిందూపురంలో రాజకీయ సమీకరణలు మారాయి. వైసీపీకి చెందిన 13 మంది వైసీపీ కౌన్సిలర్లు టీడీపీ లో చేరారు. చైర్ పర్సన్ ఇంద్రజ రాజీనామాతో ఎన్నిక అనివార్యం అయ్యింది. ఎన్నికలకు ముందు మున్సిపల్ చైర్ పర్సన్ ఇంద్రజ టీడీపీకి మద్దతు ప్రకటించింది. మొత్తం 38 కౌన్సిలర్లలో 23 మంది కౌన్సిలర్లు చైర్మన్ ను ఎన్నుకున్నారు.