ఉత్తరాంధ్ర ప్రజలు రాజధాని మార్పు కోరుకోవడం లేదు: ఎమ్మెల్సీ

ఉత్తరాంధ్ర ప్రజలు విశాఖను పరిపాలన రాజధానిగా కోరుకోవడం లేదని ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్‌ అన్నారు.

Update: 2020-02-14 08:10 GMT

విశాఖపట్నం: ఉత్తరాంధ్ర ప్రజలు విశాఖను పరిపాలన రాజధానిగా కోరుకోవడం లేదని ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్‌ అన్నారు. భూసేకరణ పేరిట రెవెన్యూ అధికారులు బలవంతంగా భూములు తీసుకున్న బాధిత రైతులతో విశాఖ నగర పరిధి ఆనందపురం మండలం గంభీరంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అమరావతిని రాజధానిగా ప్రజలంతా అంగీకరించారన్నారు. ఈ విషయంపై నాలుగు రోజులుగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖలలో పర్యటించి ప్రజలతో మాట్లాడామన్నారు.

విశాఖ రాజధాని అయితే నిత్యావసరాల వస్తువుల ధరలు పెరుగుతాయని మధ్యతరగతి కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయన్నారు. అమరావతిలో రాజధాని నిర్మించలేక పరిపాలన వికేంద్రీకరణ పేరిట రాష్ట్ర ప్రజలతో ప్రభుత్వం ఆటలాడుకుంటోందని విమర్శించారు. ప్రజలకు అభివృద్ధి వికేంద్రకరణ కావాలి తప్పా పరిపాలన వికేంద్రీకరణ కాదన్నారు. రాష్ట్ర ఉపాధి హామీ పథకం మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


Tags:    

Similar News