రైతు భరోసా కాదు.. దగా.. చంద్రబాబు సీఎంగా ఉంటే అంత సొమ్ము వచ్చేది

రైతు భరోసా పేరుతో జగన్ సర్కార్ రైతులను మోసం చేస్తోందని టీడీపీ నేత కిమిడి కళా వెంకట్రావు విమర్శించారు.

Update: 2020-05-15 13:03 GMT
kala venkata rao(File photo)

రైతు భరోసా పేరుతో జగన్ సర్కార్ రైతులను మోసం చేస్తోందని టీడీపీ నేత కిమిడి కళా వెంకట్రావు విమర్శించారు. మేనిఫెస్టోలో రూ.50వేలు ఇస్తామని చెప్పి.. రూ.67 వేలకు రైతు భరోసా పెంచినట్లుగా జగన్ ప్రభుత్వం అబద్ధపు ప్రకటన విడుదల చేసిందని విమర్శించారు.

వాస్తవంగా రాష్ట్ర నిధుల నుంచి జగన్ ఇస్తున్నది ఏడాదికి రూ.7,500 చొప్పున ఐదేళ్లకు ఇస్తున్నది రూ.37,500 మాత్రమేనని, టీడీపీ అధికారంలో వుంటే లక్షా 15వేలు వచ్చి ఉండేవని అన్నారు. ఇచ్చిన హామీలో 30వేలు ఎగనామం పెట్టారని ఆరోపించారు.

రైతుల గురించి జగన్మోహన్‌రెడ్డి చెప్పింది కొండంత.. చేస్తోంది గోరంతని దుయ్యబట్టారు. జగన్ వల్ల ప్రతి రైతు నష్టపోయేది రూ.77,500 నష్ట పోతున్నారని అన్నారు. ఏడాదికి రూ.6 వేలు చొప్పున ఐదేళ్లలో కేంద్ర ఇస్తున్న రూ.30 వేలను తాను ఇస్తున్నట్లుగా చెప్పుకోవడం అశ్వత్థామ హతహ, కుంజరహ అన్న విధంగా ఉందని, రైతుల విషయంలో మాట తప్పారు, మడమ తిప్పారుని ఎద్దేవా చేశారు. 

Tags:    

Similar News