Chandrababu: శ్రీకాకుళంలో నేడు టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన

Chandrababu: వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే టార్గెట్‌గా ప్రణాళికలు

Update: 2024-02-26 05:05 GMT

Chandrababu: శ్రీకాకుళంలో నేడు టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే టార్గెట్‌గా ప్రతిపక్ష టీడీపీ కదలి రా సభలు నిర్వహిస్తోంది. ఈ బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొననున్నారు. కాగా ఈ సభ కోసం టీడీపీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రీకాకుళంలోని ఎనభై అడుగుల రోడ్డులో ఈ బహిరంగ సభను నిర్వహించనున్నారు. పార్టీ శ్రేణులతో పాటు సుమారు లక్ష మంది ప్రజలు సభకు హాజరయ్యేలా టీడీపీ ప్లాన్ చేసింది.

అయితే 2013లో ఇదే స్థలంలో చంద్రబాబు ఆఖరి సభను ఏర్పాటు చేసి 2014 ఎన్నికల్లో విజయం సాధించారు. ప్రస్తుతం అదే స్థలంలో మళ్లీ సభను ఏర్పాటు చేయడంతో.. రాబోయే ఎన్నికల్లో కూడా విజయం సాధిస్తారనే సెంటిమెంట్‌తో టీడీపీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాగా మధ్యాహ్నం రెండున్నర గంటలకు సభ ప్రారంభమై.. సాయంత్రం ఐదున్నర గంటలకు పూర్తవుతుందని టీడీపీ శ్రేణులు తెలిపారు.

ఇక టీడీపీ, జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థుల జాబితా ప్రకటన అనంతరం శ్రీకాకుళంలో సభ జరుగుతుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. చంద్రబాబు రాకతో అటు జనసేన, ఇటు టీడీపీ కార్యకర్తల్లో మరింత జోష్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ సభలో మెయిన్‌గా వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలే టార్గెట్‌గా చంద్రబాబు స్పీచ్ ఉంటుందని టీడీపీ శ్రేణులు అంటున్నారు. వ్యవసాయ ఆధారిత ప్రాంతమైన శ్రీకాకుళం జిల్లాకు సీఎం జగన్ ద్రోహం చేశారని ప్రజలకు వివరించనున్నారు. ముఖ్యంగా వంశధార, నాగావళి నదుల అనుసంధానం, తోటపల్లి రిజర్వాయర్ ఆయకట్టు, ఆఫోషోర్, కిడ్నీ బాధితులను గత ప్రభుత్వం అందించిన సుజల ధార పథకాలను వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని కౌంటర్ ఎటాక్ చేయనున్నారు. 

Tags:    

Similar News