నాడు వైఎస్, నేడు జగన్ అదే చేస్తున్నారు .. చంద్రబాబు ట్వీట్

టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జగన్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు.

Update: 2020-05-03 11:53 GMT
Chandrababu Naidu, YS Jaganmohan Reddy

టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జగన్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే సందర్భంగా మీడియాకు చంద్రబాబు అభినందనలు తెలిపారు. పత్రికా స్వేచ్ఛను రాష్ట్ర ప్రభుత్వం అణగదొక్కుతోందని విమర్శించారు.

అప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా జీవో 938 తెచ్చారని, ఇప్పుడు వైఎస్ జగన్ పాలనలో జీవో 2430 తెచ్చారని... అప్పుడూ, ఇప్పుడూ తాము మీడియాకు అండగా ప్రభుత్వంపై పోరాడుతున్నామని పేర్కొన్నారు.

'పత్రికా స్వేచ్ఛకు కట్టుబడిన పార్టీ తెలుగుదేశం. ప్రజాస్వామ్యానికి మూలస్తంభం మీడియా. పత్రికా స్వేచ్ఛకు ఎప్పుడు ప్రమాదం వాటిల్లినా ముందుండి పోరాడింది. రాజశేఖర్ రెడ్డి హయాంలో జీవో 938కి వ్యతిరేకంగా, జగన్ మోహన్ రెడ్డి పాలనలో జీవో 2430కు వ్యతిరేకంగా పోరాటం చేశాం. పాత్రికేయులు, సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడం బాధాకరం.' అని చంద్రబాబు ట్వీట్ చేశారు. విమర్శలు స్వాగతించాలన్నారు. పాత్రికేయులపై తప్పుడు కేసులు పెట్టడం మానుకోవాలని సూచించారు.



 


Tags:    

Similar News