Andhra Pradesh: అమరావతిలో కొనసాగుతోన్న టీడీఎల్పీ సమావేశం

అమరావతిలో టీడీఎల్పీ సమావేశం కొనసాగుతోంది. రేపు (సోమవారం) శాసన సభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు.

Update: 2020-01-26 08:44 GMT

అమరావతిలో టీడీఎల్పీ సమావేశం కొనసాగుతోంది. రేపు (సోమవారం) శాసన సభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు. సభకు హాజరుకాకుండా ఉండాలని టీడీపీ నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఈ సమావేశానికి పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు డుమ్మా కొట్టారు. మండలిలో టీడీపీకి 32 మంది సభ్యులు ఉండగా... టీడీఎల్పీ సమావేశానికి 23 మంది హాజరయ్యారు. మరో ఐదుగురు ఎమ్మెల్సీలు పలు కారణాలతో హాజరుకాలేకపోతున్నట్టు సమాచారం ఇచ్చారు.

మూడు రాజధానుల బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని నిర్ణయించిన నేపథ్యంలో.. పెద్దలసభను రద్దు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈమేరకు సీఎం జగన్ గురువారం అసెంబ్లీలో మండలి రద్దుపై మాట్లాడారు. రేపు ఉదయం 9 గంటలకు మంత్రివర్గం సమావేశం కాబోతోంది. సమావేశంలో తీర్మానం చేసిన అనంతరం ఉదయం 11 గంటలకు అసెంబ్లీని సమావేశపరుస్తోంది. ఈ సందర్బంగా సభ్యులు మండలి అంశంపై మాట్లాడనున్నారు.

Tags:    

Similar News