Taneti Vanita: టీడీపీ విమర్శలపై మండిపడ్డ హోం మంత్రి తానేటి వనిత
Taneti Vanita: సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు పెడుతున్న వారి ఆట కట్టిస్తామన్న మంత్రి
Taneti Vanita: టీడీపీ విమర్శలపై మండిపడ్డ హోం మంత్రి తానేటి వనిత
Taneti Vanita: టీడీపీ నేతలే మహిళలపై దాడులు చేసి... దొంగే దొంగా అన్నట్లు ఉందని హోమ్ మంత్రి తానేటి వనిత అన్నారు. సీఎం జగన్ మహిళలపై దాడుల నిరోధానికి చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. జగనన్న ప్రభుత్వం తీసుకొచ్చిన దిశా యాప్ ద్వారా 13 వందల మంది మహిళలు రక్షణ పొందారని... టీడీపీ హయాంలో ఇలాంటి రక్షణ చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు.
వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు పెద్ద పీట వేశామన్నారు. టీడీపీ ఉనికి కోల్పోతుందనే... మహిళలపై దాడులంటూ వైసీపీ ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని విమర్శించారు. సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు పెడుతున్న వారి ఆట కట్టించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.