CM Chandrababu: ఇవాళ తిరుపతిలో సీఎం చంద్రబాబు పర్యటన

CM Chandrababu: ఇవాళ తిరుపతిలో సీఎం చంద్రబాబు, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్, కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్ పర్యటించనున్నారు.

Update: 2025-12-26 06:10 GMT

CM Chandrababu: ఇవాళ తిరుపతిలో సీఎం చంద్రబాబు, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్, కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్ పర్యటించనున్నారు. తిరుపతి వేదికగా ఇవాళ్టి నుంచి ఈ నెల 29 వరకు భారత విజ్ఞాన్ సమ్మేళన్ జరగనుంది. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, మోహన్‌ భగవత్, షెకావత్ పాల్గొననున్నారు.

ఈ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు.. తిరుపతిలో నూతనంగా నిర్మించిన ఎస్పీ కార్యాలయాన్ని కూడా ప్రారంభించనున్నారు. మరోవైపు.. తిరుపతిలో ప్రముఖుల పర్యటన నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా.. 3వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Tags:    

Similar News