Vote Note Case: చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలన్న పిటిషన్‌పై నేడు విచారణ

Vote Note Case: పిటిషన్ దాఖలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి

Update: 2024-04-04 04:38 GMT

Vote Note Case: చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలన్న పిటిషన్‌పై నేడు విచారణ

Vote Note Case: సుప్రీంకోర్టులో ఇవాళ ఓటుకు నోటు కేసు విచారణ జరగనుంది. ఈ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలన్న పిటిషన్‌పై, ఇదే కేసును సీబీఐకి అప్పగించాలన్న మరో పిటిషన్‌పై కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేయనుంది. కాగా ఈ కేసులో చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లను జస్టిస్ సుందరేష్, జస్టిస్ ఎస్.వి.ఎన్ భట్టి ధర్మాసనం విచారణ జరపనుంది.

Tags:    

Similar News