వైసీపీ జోష్.. సక్సెస్ ఫుల్ గా వైసీపీ సామాజిక సాధికార యాత్రలు
YSRCP: టీడీపీ, జనసేనకు ధీటుగా ప్రజల్లోకి వెళ్లేలా వైసీపీ ప్లాన్
వైసీపీ జోష్.. సక్సెస్ ఫుల్ గా వైసీపీ సామాజిక సాధికార యాత్రలు
YSRCP: వైసీపీ సామాజిక సాధికార యాత్రలు సక్సెస్ ఫుల్ గా సాగుతున్నాయి. అధికార పార్టీ జోష్ లో ప్రజల్లోకి వెళుతోంది. పార్టీ నేతలతో పాటు సీఎం జగన్ రంగంలోకి దిగనున్నారు. ఎంత మంది కలిసి వచ్చినా తను మాత్రం సింగిలే అని జగన్ అంటున్నారు. మీకు మంచి జరిగితేనే ఓటు వెయ్యండని జగన్ పిలుపునిస్తున్నారు. నాలుగున్నర ఏళ్ల పాలన ప్రజల్లోకి తీసుకుని వెళ్లేందుకు ఇప్పటికే కార్యక్రమాలను వైసీపీ రూపొందించింది. గడిచిన నాలుగున్నర ఏళ్లలో తాము ప్రజలకు చేసిన వాగ్దానాలన్ని పూర్తి చేశామని..అదనంగా కూడా కొన్ని పథకాలు ప్రజలకు అందజేస్తున్నామని వైసీపీ నేతలు చెబుతున్నారు. రాష్ట్రంలో అభివృద్ది జరగలేదని , అవినీతి పెరిగిపోయిందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. అయితే తమకు ప్రజలే ముఖ్యం..వారికి కావాల్సినవి అందించిన తర్వాతే అభివృద్ది అనే నినాదంతో వైసీపీ ముందుకు వెళ్తోంది.
రాబోయే ఎన్నికల్లో విజయం సాధిస్తామనే నమ్మకంతో అధికార వైసీపీ ఉంది. అందుకే గడిచిన నాలుగున్నర ఏళ్లలో చేపట్టిన ప్రజాసంక్షేమ కార్యక్రమాలు, అమలు చేసిన పథకాల గురించి ప్రజలకు వివరించి ..మళ్లీ ఓట్లు అడిగేందుకు గడప గడపకు మన ప్రభుత్వం తో అనేక కార్యక్రమాలు వైసీపీ నిర్వహిస్తోంది. ఇప్పటి వరకు చేసిన కార్యక్రమాల్ని ప్రజలకు చెప్పి మళ్లీ తమ పార్టీకే ఓటు వేయాలనే విధంగా ప్రణాళికను వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తోంది.
ఏపీలో ఈసారి వైసీపీని గద్దె దింపాలని జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తామని ప్రకటించాయి. ఉమ్మడి కార్యాచరణతో పాటు సీట్ల సర్దుబాటు కూడా ఓ కొలిక్కి వచ్చింది. ఇందులో భాగంగానే అటు టీడీపీ నేత లోకేష్ యువగళం పేరుతో, జనసేన పవన్ కళ్యాణ్ వారాహియాత్ర పేరుతో వైసీపీ ప్రభుత్వాన్ని ఎటాక్ చేస్తున్నాయి. ఈ రెండు పార్టీలకు దీటుగా వైసీపీ ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్దమైంది. ఎలాగైనా ఈసారి ఎన్నికల్లో కూడా తమ పార్టీనే అధికారంలోకి రావాలనే కృతనిశ్చయంతో రాష్ట్రంలోని మూడు ప్రాంతాలను బస్సు యాత్రలతో చుట్టేస్తుంది. ఇప్పటికే ఫస్ట్ పేజ్ కంప్లీట్ చేసిన వైసీపీ సెకండ్ ఫేజ్ పార్టీ శ్రేణులో జోష్ పెంచుతోంది.
మరోవైపు చంద్రబాబు అరెస్ట్ తో రెండు నెలలుగా డీలా పడిన తెలుగు తమ్ముళ్లు, జన సైనికులు..బాబు విడుదలతో మళ్లీ వైసీపీపై విమర్శల దాడిని మొదలుపెట్టడానికి సిద్దమవుతున్నారు. మరో ఐదు , ఆరు నెలల్లో జరిగే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే వైసీపీ తన యాక్షన్ ప్లాన్ స్పీడ్ అప్ చేసింది.