పేదలకు ఇళ్లస్థలాలు ఇచ్చే విషయంలో బాధ్యతగా పని చేయండి: సబ్ కలెక్టర్

నియోజకవర్గంలోని ముసునూరు మండలం చక్కపల్లి గ్రామంలోని గ్రామ సచివాలయంని సబ్ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆకస్మిక తనిఖీ చేశారు.

Update: 2020-02-14 08:20 GMT

నూజివీడు: నియోజకవర్గంలోని ముసునూరు మండలం చక్కపల్లి గ్రామంలోని గ్రామ సచివాలయంని సబ్ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఒక వాలంటీర్ కూడా లేకపోవడంతో మొత్తం వాలంటీర్లు అందరూ తమ కార్యాలయానికి రావలసిందిగా ఆదేశించారు. చెక్కపల్లి గ్రామంలో 28 వాలంటీర్ ఉండగా 27 మంది వాలంటీర్లు సబ్ కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు.

సబ్ కలెక్టర్ మాట్లాడుతూ గ్రామంలో స్థలాన్ని ఇచ్చే విషయం ఎంతవరకు వచ్చింది అనగా వారు సరిగా స్పందించకపోవడంతో గ్రామాల ప్రజలకు ప్రభుత్వానికి మీరు వారధి లాంటి వారిని కార్యాలయంలో ఎప్పుడూ అందుబాటులో ఉండాలని పేద ప్రజలకు ఇచ్చే విషయంలో తహసీల్దార్ పై ఒత్తిడి తేవాలని సూచించారు. సబ్ కలెక్టర్ కార్యాలయ సిబ్బందిని పిలిచి వీరందరి దగ్గర అటెండె న్స్ తీసుకుని పేర్లు ఫోన్ నెంబర్ నమోదు చేసుకోవాలి ఆదేశించారు. రేపటి నుండి ప్రతి వాలంటీర్ బాధ్యతగా పనిచేసి పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇచ్చే విషయంలో మీ వంతు కృషి చేయాలని ఆదేశించారు.

Tags:    

Similar News