TTD Darshan Tickets: శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. నేడు ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల

TTD Darshan Tickets online: ఏప్రిల్ కు సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన టికెట్ల కోటాను శనివారం ఉదయం 10గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయనుంది.

Update: 2025-01-18 00:16 GMT

TTD: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..రేపు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

TTD Darshan Tickets online: ఏప్రిల్ కు సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన టికెట్ల కోటాను శనివారం ఉదయం 10గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయనుంది.

ఏప్రిల్ కు సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన టికెట్ల కోటాను శనివారం ఉదయం 10గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయనుంది. ఈ సేవల లక్కీడీప్ కోసం ఈనెల 20న ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు.

* కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపకాలంకార సేవాల టికెట్లు, ఏప్రిల్ 10 నుంచి 12 వరకు నిర్వహించనున్న శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాల ఆర్జిత సేవాట టికెట్లను ఈనెల 21న ఉదయం 10గంటలకు విడుదల చేస్తారు. ఇదే రోజు మధ్యాహ్నం మూడింటికి వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్ల కోటాను విడుదల చేయనున్నారు.

*23న ఉదయం 10గంటలకు అంగప్రదక్షిణం టోకెన్ల కోటా, ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శనం కోటా, మధ్యాహ్నం మూడింటికి వ్రుద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, దివ్యాంగుల ఉచిత ప్రత్యేక దర్శన టోకెన్ల కోటాను రిలీజ్ చేస్తారు.

*24న ఉదయం 10గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ. 300టికెట్ల కోటా, అద్దెగదుల బుకింగ్ కోటా మధ్యాహ్నం మూడింటికి ఉంటుంది.

* 27న శ్రీవారి సాధారణ, నవనీత, పరకామణి సేవల కోటలు ఉదయం 11, మధ్యాహ్నం 12, 1గంటకు విడుదల చేస్తారు.

* భక్తులు గమనించి https://ttdevasthanams.ap.gov.in వెబ్ సైటల్లో సేవా టికెట్లను బుక్ చేసుకోవచ్చు. 

Tags:    

Similar News