Srisailam: శ్రీశైలం దేవస్థానానికి ఐఎస్వో గుర్తింపు
Srisailam: అంతర్జాతీయ ప్రమాణాలు పాటిస్తున్నారని 7 రకాల ధృవీకరణ పత్రాలు
Srisailam: శ్రీశైలం దేవస్థానానికి ఐఎస్వో గుర్తింపు
Srisailam: శ్రీశైలం దేవస్థానంలో పలుపరిపాలన విధివిధానాలకు అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ ISO గుర్తింపునిచ్చింది. హెచ్.ఎం.వై సంస్థ ప్రతినిధులు ఈ ధృవీకరణలను రాష్ట్రదేవదాయశాఖమంత్రి కొట్టుసత్యనారాయణ, ఆలయ ఈవో లవన్న కు అందజేశారు. మొత్తం ఏడుధృవీకరణలు లభించగా వాటిలో పరిపాలనా విధివిధానాలకుగాను ISO-9001 : క్యాలిటీ మేనేజ్ మెంట్ ధృవీకరణ, క్షేత్రపరిధిలో పర్యావరణ పరిరక్షణకై దేవస్థానం చేపడతున్న చర్యలకు ISO-14001: పర్యావరణ సమృద్ధీకరణ, భక్తులు, స్థానికులకు కల్పిస్తున్న వైద్యసేవలకు ఐఎన్వో-45001 ఆకుపేషనల్ హెల్త్ అండ్ సేఫ్టీ మెజర్ మెంట్, అన్నదానం, ప్రసాదాల తయారీలో నాణ్యతాప్రమాణాలకు
ఐఎస్వో-22000: ఫుడ్ సేప్టీ మేనేజ్ మెంట్ సమృద్ధీకరణ, అధునాతనపద్ధతిలో సీసీ కెమరాల నిర్వహణ, సాఫ్ట్ వేర్ వినియోగానికి సంబంధించి ISO 27001: ఇన్ఫర్మేషన్ అండ్ సెక్యూరిటీ మేనేజ్ మెంట్, ఎల్ ఈడీ దీపాల వినియోగంకు ISO-50001: ఎనర్జీమేనేజ్మెంట్, పారిశుద్ధ్య నిర్వహణ కు గుడ్ హైజెనిక్ సర్టిఫికెట్లు లభించాయి. ఈసందర్భంగా హెచ్.వై.ఎం సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఆలపాటి శివయ్య మాట్లాడుతూ దేవస్థానం పాటిస్తున్న ఉన్నత ప్రమాణాలను పరిశీలించి దేవస్థానానికి ఈధృవీకరణలు అందజేశామని తెలిపారు.