Srisailam: శ్రీశైలం దేవస్థానంలో మహా అపచారం.. పులిహోర ప్రసాదంలో మాంసపు ఎముక..

Srisailam: దేవస్థానం అధికారులకు ఆధారాలతో ఫిర్యాదు చేసిన భక్తుడు

Update: 2024-02-09 13:15 GMT

Srisailam: శ్రీశైలం దేవస్థానంలో మహా అపచారం.. పులిహోర ప్రసాదంలో మాంసపు ఎముక.. 

Srisailam: నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానంలో మహా అపచారం చోటు చేసుకుంది. పులిహోర ప్రసాదంలో మాంసపు ఎముక కలకలం రేపింది. భక్తులకు అందించే పులిహోర ప్రసాదంలో ఎముక ప్రత్యక్షమైంది. అమ్మవారి ఆలయ బ్రహ్మానందరాయ గోపురం వద్ద ప్రసాదాల పంపిణీలో చోటు చేసుకుంది. పులిహారలో మాంసపు ముక్కను హైదరాబాద్‌కు చెందిన భక్తుడు హరీష్‌రెడ్డి గుర్తించారు. దీంతో దేవస్థానం అధికారులకు ఆధారాలతో భక్తుడు ఫిర్యాదు చేశారు. అధికారుల పర్యవేక్షణ లోపంపై భక్తులు మండిపడ్డారు. ప్రసాదంలో ఎముక రావడంపై అధికారులు విచారణ చేపట్టారు.

Tags:    

Similar News