Srikalahasti: జనసేన కార్యకర్తపై చేయిచేసుకున్న మహిళా సీఐ
Srikalahasti: శ్రీకాళహస్తి ఎమ్మెల్యే కూతురిని కూడా... జాగ్రత్త అంటూ హెచ్చరించినట్లు ఆరోపణలు
Srikalahasti: జనసేన కార్యకర్తపై చేయిచేసుకున్న మహిళా సీఐ
Srikalahasti: శ్రీకాళహస్తిలో సీఐ అంజూ యాదవ్ మరోసారి రెచ్చిపోయారు. నిరసనలో పాల్గొన్న జనసేన నేతపై సీఐ దాడికి పాల్పడ్డారు. జనసేన కార్యకర్తపై సీఐ చేయి చేసుకోవడంతో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే కూతురిని కూడా జాగ్రత్త అంటూ గతంలో హెచ్చరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. గతేడాది ఓ హోటల్ నిర్వాహకురాలిపై సీఐ దాడి చేసినట్లు సమాచారం. సీఐ అంజూయాదవ్ వైసీపీ కార్యకర్తలా పనిచేస్తుందని జనసేన శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు.