కరోనా వైరస్ ఇప్పట్లో మానవాళిని వదిలిపోయే అవకాశం లేదని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిస్తున్నాయి. ఇక దానితో కలిసి జీవించడం ఎలాగో నేర్చుకోవాలని స్పష్టతనిస్తున్నాయి. ఈనెల 17వ తేదీతో లాక్‌డౌన్ ముగిసిన తర్వాత పరిస్థితులు మళ్లి మాములు స్థితికి చేరుకుంటాయిని తెలుస్తోంది. ఈ లాక్‌డౌన్ కారణంగా మూతపడ్డ వాటిని క్రమంలోనే తిరిగి తెరిచేందుకు సిద్ధమవుతున్నాయి.
దేవాలయాలు ఇప్పట్లో తెరుచుకునే అవకాశం లేదనే వార్తల నేపథ్యంలో చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి, కాణిపాకం దేవాలయాల్లో భౌతిక దూరం పాటిస్తూ.. భక్తులను ఆలయాల్లోకి అనుమతించే అంశంపై కసరత్తు మొదలైంది.
ఈ రెండు దేవస్థానాలకు సంబంధించిన అధికారులు ఆలయాల్లోని భక్తులకు అనమతి ఇవ్వాలని నిర్ణయించాయి. ఇప్పటికే భక్తుల క్యూ లైన్లలో భౌతిక దూరం పాటించేలా సర్కిల్స్ గీశారు. లాక్ డౌన్ ముగిసిన తరువాత భక్తులను ఆలయాల్లోకి అనుమతించి సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
అయితే ఈ దేవాలయాల అధికారులు ప్రభుత్వానికి పలు ప్రతిపాదనలు పంపారు. వారి ప్రతిపాదనలకు ప్రభుత్వం నుంచ లభిస్తుందా లేదా అన్నది మాత్రం తెలియరాలేదు. ఒకవేళ ఈ రెండు దేవాలయాల్లో ఈ రకమైన ప్రయోగం ఫలిస్తే... తిరుమలలోనే ఇదే రకమైన పద్ధతిని పాటించి భక్తులను దర్శనాలకు అనుమతించే అవకాశం ఉంది. కాగా.. ఎంతోకాలం లాక్ డౌన్ విధించలేం అని ప్రభుత్వాలు చెబుతున్నాయి.
ఏపీ సీఎం జగన్ ఇదివరకే కరోనాతో కలిసి జీవించడం అలవాటు చేసుకోవాలని, ప్రజలను అందుకు సిద్ధం చేయాలని, భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, పరిశుభ్రత అవసరమని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.