ఆ గ్రామంలో ఓ తల్లి తన కూతురిని ఇంట్లో బంధీగా ఉంచింది. ఆ కూతురు మాత్రం ఎప్పుడెప్పుడు.. ప్రపంచాన్ని చూద్దామని ఎదురుచూస్తుంది. కిటికీ నుంచే కుమార్తెకు కావల్సిన ఆహార పదార్థాలను అందిచేది. కానీ కూతురును మాత్రం బయటకు పంపించేది కాదు.. ఈ దారుణ ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది.
ఇచ్చాపురంలోని తన అన్నయ్య ఇంట్లో లక్ష్మి తన కూతురితో నివాసం ఉంటుంది. 2022లో తన కుమార్తె 9వ తరగతి చదువుతుండగా.. రజస్వల అయింది. అప్పటి నుంచి తల్లి కుమార్తెను బయటకు పంపిచకుండా ఇంట్లో ఉంచుతూ వచ్చింది. బాలిక అటు బడికి వెళ్ళక.. ఇటు బయటకు రాకపోవడంతో స్థానికులు పలుమార్లు తల్లి లక్ష్మిని నీలాదీసారు. మూడు సంవత్సరాలు గడుస్తున్నా బాలిక బయటకు రాకపోవడంతో... స్థానికులుICDSకు సమాచారం అందించారు. దీంతో సివిల్ కోర్టు జడ్జి పరేష్ కుమార్, తహసీల్దార్ వెంకటరావు, ICDS సీడీపీఓ రాజేశ్వరి, MEO అప్పారావు పోలీసులు రంగంలోకి దిగారు. తల్లి నిరాకరించినప్పటికీ, చివరకు బలవంతంగా గదిని తెరిచి బాలికను బయటకు తీసుకువచ్చారు. చీకటిలో సంవత్సరాల తరబడి ఉండటం వల్ల బాలిక నడవలేని స్థితిలో కనిపించడం అందరినీ కలచివేసింది. తల్లి మానసిక సరిస్థితి సరిగా లేనట్లు అధికారులకు గుర్తించారు. దీంతో బాలికను కోర్టుకు తరలించి.. జడ్జి స్వయంగా కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం ICDS సిబ్బంది తల్లిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.