ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి
గ్రామీణ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువనేత దాడిశెట్టి శ్రీనివాస్ స్పష్టం చేశారు.
తుని: గ్రామీణ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువనేత దాడిశెట్టి శ్రీనివాస్ స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో దోమల నిర్మూలనకు ఫాగ్గిన్ మిషన్లు ను శనివారం మండల పరిషత్ కార్యాలయంలో ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దాడిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాన్ని పరీక్షించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, అందుకు అనుగుణంగా అధికారులను బాధ్యతాయుతంగా పనిచేయాలని పిలుపు నిచ్చారు.
దోమల నిర్మూలనకు ప్రతిరోజు గ్రామాల్లో ఫాగ్గిన్ మిషన్ ను వినియోగించాలి అన్నారు. పేద ప్రజల అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు సమర్థవంతంగా అమలు చేస్తున్నారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం లో ఎండివో శ్రీను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోతల రమణ, చోడరాజు రాంబాబు, రాజు, పోతుల లక్ష్మణ్, ఎస్.కె. క్వాజా తదితరులు పాల్గొన్నారు.