Simhachalam: సింహాచలం ఘటనలో సాఫ్ట్ వేర్ దంపతులు దుర్మరణం..పీఎం మోదీ దిగ్భ్రాంతి
Simhachalam: సింహాచలం ఘటనలో మరణించినవారిలో సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు చేస్తున్న దంపతులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరిని విశాఖలోని మధురవాడ చంద్రంపాలెం గ్రామానికి చెందిన దంపతులు ఉమామహేశ్వరరావు, శైలజగా గుర్తించారు. వీరు హైదరాబాద్ లోని ఓ సాఫ్ట్ వేర్ సంస్థల్లో విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. మూడేళ్ల క్రితమే వీరికి వివాహం జరిగింది. బుధవారం తెల్లవారుజామున 2గంటలకు దర్శన నిమిత్తం రూ. 300 క్యూలైన్ లో వేచి ఉండగా గోడకూలింది. ఈ ఘటనలో ఈ ఇద్దరు దంపతులు మరణించారు. అందరితో కలివిడిగా ఉండే దంపతులు మరణించడంతో కటుంబ సభ్యలు, బంధువులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.
అటు సింహాచలం ఆలయంలో జరిగిన ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రధానమంత్రి జాతీయ సహాయనిధి నుంచి ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. మరణించినవారి కుటుంబాలకు రూ. 2లక్షల చొప్పున గాయపడిన వారికి రూ. 50వేల చొప్పున అందించనున్నట్లు తెలిపారు.
అటు ఈ ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గోడకూలి భక్తులు మరణించిన ఘటన తీవ్ర ఆవేదన కలిగించిందన్నారు. మరణించినవారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.