YCP: వైసీపీలో చేరిన అవనిగడ్డ ఇంచార్జీగా సింహాద్రి చంద్రశేఖర్ రావు
YCP: చంద్రశేఖర్‌తో పాటు పార్టీలో చేరిన ఆయన కుమారుడు రాంచరణ్
YCP: వైసీపీలో చేరిన అవనిగడ్డ ఇంచార్జీగా సింహాద్రి చంద్రశేఖర్ రావు
YCP: అవనిగడ్డ వైసీపీ ఇంచార్జీగా సింహాద్రి చంద్రశేఖర్ రావును సీఎం జగన్మోహన్ రెడ్డి ఇటీవల నియమించారు. అయితే సోమవారం నాడు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ సమక్షంలో సింహాద్రి చంద్రశేఖర్ రావుతో పాటు ఆయన కుమారుడు రాంచరణ్ వైసీపీలో చేరారు. వయసు రీత్యా ఎన్నికల్లో పోటీచేయలేనని జగన్‌కు చెప్పినట్లు చంద్రశేఖర్ రావు తెలిపారు. తన కుమారుడు రాంచరణ్‌కి టికెట్ ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. తన కుమారుడికి టికెట్ ఇస్తే గడప గడపకు తిరిగి అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించి వైసీపీని గెలిపించేందుకు ప్రయత్నిస్తా అని చెప్పారు.