Nellore: నెల్లూరులో శివపార్వతుల కళ్యాణం
Nellore: మహాశివరాత్రి వేడుకల్లో పార్వతీపరమేశ్వరుల పరిణయం
Nellore: నెల్లూరులో శివపార్వతుల కళ్యాణం
Nellore: మహాశివరాత్రి వేడుకల్లో పార్వతీ పరమేశ్వరుల కళ్యాణోత్సం కన్నులపండువగా సాగింది. నెల్లూరులో మహాశివరాత్రి వేడుకల్లో శివజాగరణ అనంతం స్వామివారికి సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకించారు. పార్వతీ, పరమేశ్వరులను సర్వాలంకారశోభితులను చేసి వధూవరులుగా తీర్చి దిద్దారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. నారాయణ విద్యాసంస్థల నిర్వాహకులు వేమిరెడ్డి విజయ భాస్కర్ రెడ్డి, రుక్మిణీ దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు