Anantapur Gun Fire: అనంతపురంలో కాల్పుల కలకలం

Anantapur Gun Fire: అనంతపురం జిల్లా ఆకుతోటపల్లి గ్రామంలో సీఐ జరిపిన కాల్పులు కలకలం రేపాయి.

Update: 2025-12-22 10:49 GMT

Anantapur Gun Fire: అనంతపురంలో కాల్పుల కలకలం

Anantapur Gun Fire: అనంతపురం జిల్లా ఆకుతోటపల్లి గ్రామంలో సీఐ జరిపిన కాల్పులు కలకలం రేపాయి. రాజా, అజయ్ అనే వ్యక్తులు స్నేహితులతో కలిసి మద్యం సేవించే క్రమంలో గొడవ జరిగింది. అజయ్, రాజాను ఇంకొంచెం మద్యం పోయాలని అడగడంతో ఇరువురి మధ్య తీవ్రస్థాయిలో గొడవ చోటుచేసుకుంది. ఈ క్రమంలో అజయ్, రాజాను కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన రాజాను స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

విషయం తెలుసుకున్న సీఐ, తన బృందంతో నిందితుడు అజయ్ను పట్టుకోవడానికి వెళ్లగా అజయ్ కత్తితో దాడి చేశాడు. నిందితుడు పారిపోతుండగా.. సీఐ అతడి మోకాళ్లపై కాల్పులు జరిపాడు. అనంతరం పోలీసులు నిందితుడు అజయ్‌ను అదుపులోకి తీసుకుని ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Tags:    

Similar News