Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ కస్టడీపై నేడు కోర్టు తీర్పు
Vallabhaneni Vamsi: ఇవాళ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కస్టడీ పిటిషన్‌పై విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టులో విచారణ జరగనుంది.
Vallabhaneni Vamsi: ఇవాళ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కస్టడీ పిటిషన్‌పై విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టులో విచారణ జరగనుంది. కస్టడీ పిటీషన్ పై ఇప్పటికే వాదనలు పూర్తయ్యాయి. దీనిపై ప్రత్యేక న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేయనుంది. వంశీ కస్టడీ పిటిషన్‌పై ఇప్పటికే విచారణ ముగియడంతో తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.
సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసులో మరింత విచారణకు తమకు 10రోజుల కస్టడీకి వల్లభనేని వంశీని అప్పగించాలని పోలీసులు పిటీషన్ వేశారు. అయితే వంశీ తరుపున న్యాయవాదులు మాత్రం ఇందుకు అభ్యంతరం తెలిపారు. ఇందులో విచారణ చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీ వర్గీయులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.