Nakkapalle: రెండవ దఫా కూరగాయలు పంపిణీ చేసిన వేగి సత్యన్నారాయణ

Update: 2020-04-16 08:37 GMT

నక్కపల్లి: అడ్డురోడ్ లోని లారీ కాటా వద్ద గల ప్లాస్టిక్ డ్రమ్ముల వ్యాపారి ఎస్.డి. ఎంటర్ ప్రైజస్ ప్రొప్రయిటర్ వేగి సత్యన్నారాయణ ఆర్దిక సహాయంతో నక్కపల్లిలో గురువారం రెండవ విడత కూరగాయలు పంపిణీ చేశారు. లాక్ డౌన్ నేపథ్యంలో ఇప్పటికే ఒక దఫా, కూరాగాయలను గ్రామంలోని ప్రతీ ఇంటికీ అందజేశారు. కాగా నేడు ఉల్లిపాయలు, వంకాయలు, టమోటా తదితర కూరగాయలను సుమారు 1500 కుటుంబాలకు ఇంటింటికీ అందజేశారు. అలాగే నక్కపల్లి ప్రభుత్వాసుపత్రికి రూ.50 వేలతో దుప్పట్లను గతంలో అందజేశారు. వేగి సత్యన్నారయణ దాతృత్వాన్ని పలువురు అభినందిస్తున్నారు.


Tags:    

Similar News