AP SEC Nimmagadda: పోలింగ్ బూత్‌లలో నిమ్మగడ్డ సుడిగాలి పర్యటన

AP SEC Nimmagadda: ఎస్ఈసీ నిమ్మగడ్డ, కలెక్టర్లతో కలిసి పోలింగ్ స్టేషన్లు పరిశీలించారు.

Update: 2021-03-10 04:19 GMT

నిమ్మగడ్డ ఫైల్ ఫోటో (TheHansIndia)

AP SEC Nimmagadda: ఎస్ఈసీ నిమ్మగడ్డ, కలెక్టర్లతో కలిసి పోలింగ్ స్టేషన్లు పరిశీలించారు. విజయవాడలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందని.. వాలంటీర్లు వారి ఫోన్లు లేకుండా నిబంధనలను అనుసరిస్తున్నారని చెప్పారు. అధికారులు పోలింగ్ కు చేసిన ఏర్పాట్లపై ఎస్ఈసీ హర్షం వ్యక్తం చేశారు. పోలింగ్ ఏజెంట్లు సుహృద్భావ వాతావరణంలో పనిచేస్తున్నారని తెలిపారు.

మరోవైపు పురపాలక ఎన్నికల పోలింగ్ ఉదయం నుంచి‌ కోనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఈ రోజు ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. పోలింగ్ కేంద్రాలను ఎప్పటికప్పుడు అధికారులు పరిశీలిస్తున్నారు. రాష్ట్రంలోని 12 నగరపాలక సంస్థలు, 71 పురపాలక సంఘాలు,నగర పంచాయతీల్లో ఎన్నికల పోలింగ్‌ జరుగుతుంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. మొత్తం 2,214 డివిజన్లు,వార్డుల్లో కలిపి 77,73,231 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 7,549 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.


Full View


Tags:    

Similar News