Schools Re-Open in AP: ఏపీలో సెప్టెంబర్ 5 నుంచి స్కూళ్లు ప్రారంభం: సీఎం జగన్

Schools Re-Open in AP: మార్చి నెల మూడవ వారం నుంచి కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలలు మూతబడ్డాయి.

Update: 2020-07-28 14:12 GMT
YS Jagan (File Photo)

Schools Re-Open in AP: మార్చి నెల మూడవ వారం నుంచి కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలలు మూతబడ్డాయి. స్కూళ్లు, కాలేజీలు, యూనివర్శిటీలు కూడా మూత పడ్డాయి. ఇక కొన్ని పరీక్షలను రద్దు చేస్తే మరికొన్ని పరీక్షలను వాయిదా వేశారు. ప్రస్తుతం కొన్ని విద్యాసంస్థలు ఆన్లైన్ క్లాసులను నిర్వహిస్తున్నాయి. అయితే ఇన్నాళ్ళు మూసి ఉంచిన‌ పాఠ‌శాల‌ల‌ను తిరిగి ప్రారంభించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఏపీలో సెప్టెంబ‌ర్ 5వ తేదీ నుంచి పాఠశాలలు తిరిగి మొదలవుతాయని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు.

ఈ రోజు (మంగళవారం) సీఎం జ‌గ‌న్‌ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్ష స‌మావేశం నిర్వహించారు. స్కూళ్లల్లో నాడు-నేడు, వ్యవసాయం, రాష్ట్రంలో కరోనా పరిస్థితి తదితర అంశాల పైన అయన సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. ఆగస్టు 31 నాటికి పాఠశాలల్లో నాడు-నేడు పనులు పూర్తికావాలని అధికారులను సీఎం ఆదేశించారు. అంతేకాకుండా ఆగస్టు 15 లోపు పేదలకు ఇండ్ల‌ పట్టాలు పంపిణీ చేయనున్నట్లుగా సీఎం జగన్ స్పష్టం చేశారు.

ఇక అటు కరోనా విషయంలో అధికారులు, కలెక్టర్లు బాగా పనిచేశారని సీఎం కొనియాడారు. కరోనా వస్తుంది.. పోతుంది. దానితో కలిసి జీవించాల్సిన పరిస్థితి ఏర్పడిందని అయన అన్నారు. ఇక రోజుకు యాభై వేలకి పైగా పరీక్షలు చేస్తున్న రాష్ట్రం ఏపీనే అని స్పష్టం చేశారు.. ఇక ఏపీలో కరోనా కేసుల విషయానికి వచ్చేసరికి గడిచిన 24 గంటల్లో 7,948 కొత్త కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 62,979 శాంపిల్స్‌ని పరీక్షించగా 7,948 మంది కోవిడ్-19 పాజిటివ్‌గా తేలారు. 3,064 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొవిడ్‌ కారణంగా రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 58 మంది ప్రాణాలు కోల్పోయారు. 

Tags:    

Similar News