Coronavirus Updates in AP: 24 గంటల్లో 7,948 కొత్త కేసులు.. 58 మంది మృతి..

Coronavirus Updates in AP: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. గడిచిన 24...
Coronavirus Updates in AP: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 7,948 కొత్త కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 62,979 శాంపిల్స్‌ని పరీక్షించగా 7,948 మంది కోవిడ్-19 పాజిటివ్‌గా తేలారు. 3,064 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొవిడ్ కారణంగా రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 58 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో కరోనా వల్ల గుంటూరులో 11 మంది, కర్నూలులో 10 మంది, విశాఖలో 9 మంది, చిత్తూరులో ఐదుగురు, తూర్పుగోదావరిలో ఐదుగురు, కృష్ణాలో నలుగురు, నెల్లూరులో నలుగురు, విజయనగరంలో నలుగురు, అనంతపూర్‌లో ముగ్గురు, కడపలో ఒకరు, శ్రీకాకుళం ఒకరు, పశ్చిమ గోదావరిలో ఒకరు మరణించినట్లు ప్రభుత్వం బులిటెన్‌లో వెల్లడించింది.
రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు 1,07,402. ఇప్పటి వరకు కరోనా వైరస్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 1148 . ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 49,745 కి చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్ ఆసుపత్రుల్లో 56,509 మంది చికిత్స పొందుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 62,979 కరోనా శాంపిల్స్ పరీక్షించారు. ఇప్పటి వరకు ఏపీలో 17,49,425 కరోనా శాంపిల్స్ నిర్వహించింది ప్రభుత్వం.